ETV Bharat / city

'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం' - పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్​ఈసీ, చంద్రబాబే భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు. ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా రెండో దశ విజృభిస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయానికి త్వరలో ఏపీ సీఎం జగన్​ శంకుస్థాపన చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్​ నాటికి పూర్తి చేస్తామన్నారు.

polavaram
'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం'
author img

By

Published : Nov 20, 2020, 8:40 PM IST

విశాఖ కలెక్టరేట్​లో పరిశ్రమలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.. ఏపీ మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్​ పారిశ్రామిక సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్​ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి వివక్షలేకుండా పరిశ్రమల అభివృద్ధికి ఊతమందిస్తామని స్పష్టంచేశారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి ఆకాంక్షతో పారిశ్రామిక విధానం తీసుకొచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎవరు ముందుకు వచ్చినా అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం'

రమేశ్ కమిషన్​లా వ్యవహరిస్తున్నారు : ఏపీ మంత్రి కన్నబాబు

విశాఖలో పారిశ్రామిక ప్రగతిపై శుక్రవారం మధ్యాహ్నం పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతున్నట్టు ఆ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు రెండో దశ కొవిడ్ విజృభిస్తుంటే ఎన్నికలు పెడతానని ఎన్నికల కమిషన్​ అంటోందన్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు...ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎస్​ఈసీని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

ఎస్​ఈసీ..రాజ్యాంగ సంస్థలా కాకుండా రమేశ్ కమిషన్​​లా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలకు భయపడాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. కొవిడ్ రెండో దశ దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు అనుకూల పరిస్థితులు లేవంటున్నామన్నారు. బిహార్ ఎన్నికల తర్వాత కేసులు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా హయాంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్ఈసీ, చంద్రబాబే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. ఎస్​ఈసీ కోర్టులకు వెళ్లిన తమకు ఎటువంటి అభ్యంతరంలేదని మంత్రి కన్నబాబు అన్నారు.

అందుకే పోలవరం వద్ద వైఎస్ విగ్రహం : విజయసాయిరెడ్డి

అతి త్వరలో భోగాపురం విమానాశ్రయానికి సీఎం శంకుస్థాపన చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తెదేపా ఎన్​ఆర్​ఐ పార్టీలా వ్యవహరిస్తుందని విమర్శించారు. చంద్రబాబు.. తెలంగాణలో ఉంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. పోలవరం పూర్తి అవ్వకుండా తెదేపా అడ్డుపడుతుందన్నారు. పోలవరం వద్ద 150 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెదేపా సహించలేకపోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేసేందుకు.. సర్కారు వేగంగా పనులు చేయిస్తోందని తెలిపారు. ఏపీని సస్యశ్యామలం చేసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రాజెక్టుకు బీజం వేశారని చెప్పారు. అందుకే పోలవరం వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్...తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ విలువలను పాటించడంలేదన్నారు.

ఇవీచూడండి: 'జనసేనతో భవిష్యత్​లోనూ కలిసి పనిచేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.