ETV Bharat / city

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి ఎంపీ రేవంత్​రెడ్డి ట్వీట్​ - kishan reddy twitter

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డికి ఎంపీ రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి కొవిడ్​ ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంటును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ట్విట్టర్​ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆస్పత్రిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని... ఆక్సిజన్​ ప్లాంట్​ నిర్మాణమే కీలకమని పేర్కొన్నారు.

mp revanth reddy tweeted to central minister kishan reddy for oxygen plant in malkajgiri

author img

By

Published : May 12, 2021, 5:10 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను త్వర‌గా అందుబాటులోకి తెచ్చేలా చూడాల‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డికి ఎంపీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి బొల్లారం కొవిడ్ ఆస్పత్రిని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో స్థానిక ఎంపీగా తనవంతు బాధ్యతగా ‌కంటోన్మెంట్ బొల్లారం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని కొవిడ్ ఆస్ప‌త్రిగా మార్చి... నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని రెండు వారాల కిందటనే నిర్ణయించినట్లు రేవంత్‌ తెలిపారు. అందుకు సంబంధించిన ప‌నులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

ఆస్పత్రిలో క‌రోనా రోగుల‌కు చిక్సిత్స అందించేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం కీల‌క‌మని రేవంత్​ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కేర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్పత్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ నిర్మించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధన్, డీఆర్‌డీవో ఛైర్మన్ స‌తీశ్​ రెడ్డికి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే లేఖలు రాశారు.

mp revanth reddy tweeted to central minister kishan reddy for oxygen plant in malkajgiri
కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి ఎంపీ రేవంత్​రెడ్డి ట్వీట్​

ఇదీ చూడండి: వరుస భేటీలు.. చర్చోపచర్చలు... రాజకీయ భవిష్యత్తుపై ఈటల మథనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.