అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. రాజేంద్రనగర్ న్యాయస్థానంలో రేవంత్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు నిన్న అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ నెల 1న అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించారంటూ రేవంత్, ఆయన సోదరుడితో పాటు... మరికొంతమందిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. మియాఖాన్ గడ్డలోని క్రికెట్ మైదానంలో డ్రోన్ కెమెరా ఉపయోగించి వీడియోలు తీసిన ఆరుగురిని 4న అరెస్ట్ చేశారు. ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చూడండి: తన భూముల్లో జోక్యం చేసుకోవద్దంటూ.. రేవంత్ పిటిషన్