ETV Bharat / city

నాకు ప్రాణహాని ఉంది.... రక్షణ కల్పించండి: ఎంపీ రఘురామకృష్ణరాజు

తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు కొంతమంది నాపై దాడులకు పాల్పడుతున్నారని... కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

mp-raghuramakrishnaraju-letter-to-loksabha-speaker-about-ysrcp attacks
నాకు ప్రాణహాని ఉంది.... రక్షణ కల్పించండి: ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jun 21, 2020, 6:23 PM IST

తనకు ప్రాణహాని ఉందని... కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని కోరుతూ... లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు. శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిం చేసిన అవకాశం లేకపోవడం వల్ల తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పానని లేఖలో పేర్కొన్నారు. అప్పట్నుంచి తన నియోజకవర్గంలో పలువురు నేతలు అలజడి సృష్టిస్తున్నారని స్పీకర్‌కు తెలిపారు. కోట్లమంది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశానని అన్నారు.

స్వామివారి భక్తుడిగా తనలాంటివారు కోరుకున్న విషయాన్ని మీడియాతో చెప్పా... బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాను. సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డబ్బు ఇచ్చిన వారికే ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం ముఖ్యమంత్రికి చెప్పేందుకు ప్రయత్నించినా స్పందన లేదు. ఇసుక, ఇంటిస్థలాలపై డబ్బు వసూలు చేస్తున్నారన్నందుకు నాపై కక్ష కట్టారు. -ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇదీ చదవండి: జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్.. పి‌డికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.