స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సభాహక్కుల సంఘంతోపాటు లోక్‌సభ సభాపతికి.. ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటును స్తంభింపజేస్తామంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారని ఆక్షేపించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సభాపతి స్థానాన్ని ఉద్దేశించి చేసినవిగా, సభా హక్కులు ఉల్లంఘించినట్లుగానే భావించాలన్నారు.
గతంలోనూ రాజ్యసభ ఛైర్మన్‌ను విజయసాయిరెడ్డి అగౌరవపరిచారని వివరించారు. విజయసాయిరెడ్డికి ఉన్న సభాహక్కుల దుర్వినియోగ స్వభావాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలకు ఉపక్రమించాలని రఘురామ లేఖలో కోరారు. తద్వారా సభా గౌరవాన్ని పెంపొందించిన వారవుతారని రఘురామ పేర్కొన్నారు.
విజయసాయి ఏమన్నారంటే..
'నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాం. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరాం. సీఎం, పార్టీ నేతలపై రఘురామ వ్యాఖ్యలను వివరించాం. రఘురామపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరాం. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా నిరసన తెలుపుతాం. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. ఏడాది గడుస్తున్నా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేదు. సుప్రీం తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యం చేయకూడదు."- ఎంపీ విజయసాయి రెడ్డి
ఇదీ చదవండి: Somu Veerraju: 'కేసీఆర్‌కు హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమి భయం పట్టుకుంది'