ఎన్నికల్లో తన బొమ్మతోనే నెగ్గానని మరోసారి స్పష్టం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కొన్ని రోజులుగా పలు అంశాలను మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న ఆయన.. పార్టీతో పాటు ఎమ్మెల్యేలంతా తన రక్తం తాగారని ఆరోపించారు. తనను బెదిరిస్తున్న వారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని న్యాయస్థానాన్ని రఘురామకృష్ణరాజు కోరారు.
రాజీనామా చేయడానికి తాను ఖాళీగా కూర్చోలేదని అన్నారు. దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : అవినీతి తిమింగళం: ఏసీపీ ఇంట్లో సోదాలు.. రూ.70 కోట్ల ఆస్తులు