ETV Bharat / city

MP Raghurama: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ - ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ఎంపీ రఘురామకృష్ణరాజు...ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని గొల్లపాలెంలో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధిలోని తన నియోజకవర్గంలోని భీమవరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రాజధానిగా ఉందన్నారు. ఇక్కడి నుంచి సుమారు 80వేల కోట్ల సముద్ర ఉత్పత్తులు ప్రస్తుతం ఎగుమతి అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

mp rrr letter to pm modi
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ
author img

By

Published : Jun 5, 2021, 9:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి లేఖ రాసిన ఆయన.. కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధిలోని తన నియోజకవర్గంలోని భీమవరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రాజధానిగా ఉందన్నారు. ఇక్కడి నుంచి సుమారు 80వేల కోట్ల సముద్ర ఉత్పత్తులు ప్రస్తుతం ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.

ఇక్కడున్న ఆక్వా పరిశ్రమకు మరిన్ని వనరులు, నైపుణ్యాలు అందిస్తే 4, 5 లక్షల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇందుకు వ్యవస్థాగత మద్దతు కావాల్సి ఉన్నందున ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. 910 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతం నుంచి భారీగా చేపలు పట్టడానికి వీలుందని... అయితే మత్స్యకారులు 20-25 నాటికల్‌ మైళ్లకు మించి పోవడానికి వీలులేక పోవడంతో బంగాళాఖాతం లోతుల్లోనుంచి చేపలు పట్టడానికి అవకాశం లేకుండా పోయిందని లేఖలో తెలిపారు.

వారికి తగిన నైపుణ్యం కల్పిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. గతంలో కొరియా ప్రధానమంత్రి, మంత్రులతో మాట్లాడినప్పుడు భారత్‌లో వెయ్యి కోట్ల రూపాలయలతో అంతర్జాతీయ సమీకృత మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించినట్లు తెలిసిందన్న రఘురామరాజు... మీ నాయకత్వంలో ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటైతే మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆక్వాహబ్‌గా పేరొందిన నర్సాపురం నియోజకవర్గంలో ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అన్నారు.

గోదావరి ప్రాంతం నుంచి చేపలు, రొయ్యల ఎగుమతులు పెరిగి దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టడమే కాకుండా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఈ రంగంలో నంబర్‌వన్‌గా నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 600-1,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని.. తన నియోజకవర్గంలోని గొల్లపాలెంలో ఇందకు అనువైన భూమి అందుబాటులో ఉందని వెల్లడించారు. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.