ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు - ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు

mp raghu rama
mp raghu rama
author img

By

Published : May 21, 2021, 1:03 PM IST

Updated : May 21, 2021, 5:05 PM IST

16:56 May 21

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు

  • ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు
  • రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • కస్టడీలో విచారణ చేసేంత తీవ్ర అభియోగాలు కావు: సుప్రీంకోర్టు
     
16:26 May 21

మొన్న హైకోర్టు ఇచ్చిన ధిక్కరణ ఆదేశాలను సుప్రీం దృష్టికి తెచ్చిన గిరి

  • మొన్న హైకోర్టు ఇచ్చిన ధిక్కరణ ఆదేశాలను సుప్రీం దృష్టికి తెచ్చిన గిరి
  • ఆర్మీ ఆస్పత్రికి తరలించాలన్నాక వేరే ఆస్పత్రికి తరలించలేదని ధిక్కరణ నోటీసు ఎలా ఇస్తారన్న గిరి
  • ధిక్కరణ నోటీసులు ఇచ్చిన ఆదేశాల కాపీ, తేదీని చెప్పాలన్న ధర్మాసనం
  • ధిక్కరణ నోటీసు ఆదేశాల కాపీ వచ్చాక ప్రస్తావించేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

16:12 May 21

ఎంపీపై కేసు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం లాంటిదే: రోహత్గీ

  • హైకోర్టులో ఉపశమనం లభించలేదు, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం: రోహత్గీ
  • ఎంపీపై కేసు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం లాంటిదే: రోహత్గీ
     
15:56 May 21

చిన్న కాలిగాయానికి ఎవరూ ఇలా అత్యవసర చికిత్స అడగరు: దవే

రఘురామపై తీవ్ర దాడి జరిగితే సీబీఐ విచారణ అడుగుతారు: దవే

రోహత్గీ సీబీఐ విచారణ కోరుతున్నారు: దుష్యంత్ దవే

ఆర్మీ కలగజేసుకుంటే రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరు?: దవే

ఇంత అత్యవసరం ఎందుకు.. ఇలా ఎవరూ చికిత్స తీసుకోరు: దవే

15:45 May 21

కాలిపాదం రెండోవేలుపైనే ఎందుకు కొడతారు?: దవే

  • కారులో ఆస్పత్రికి వెళ్తున్న వీడియోను కోర్టుకు చూపించిన దవే
  • ఎడిమా కు అనేక వైద్య కారణాలు ఉంటాయి: దవే
  • ప్రాక్చర్ అస్పష్టంగా ఉంది. కొత్తదా లేక పాతదా అన్నది నివేదికలో తేలదు : దవే
  • పోలీసులు టార్చర్ చేయాలనుకుంటే ఒక కాలి రెండో వేలు మీద మాత్రమే చేస్తారా :దవే
  • దేశంలో ఏ పోలీసు కూడా ఒక ఎంపీతో దురుసుగా ప్రవర్తించరు: దవే
  • అంతకు ముందు ఎలాంటి ఫ్రాక్చర్ లేదని ఎక్స్-రే రిపోర్టులు ఉన్నాయి :దవే
  • ఎక్స్-రే రిపోర్టులు అబద్ధం చెప్పవు. ఈ ఫ్రాక్చర్ తర్వాత అయిందే : దవే
  • పోలీసులు కాలిపాదం రెండోవేలునే టార్చర్ ఎందుకు చేస్తారు?: దవే
  • ఎంపీ స్థాయి వ్యక్తిని పోలీసులు ఎప్పుడూ అలా చేయరు: దవే

15:32 May 21

ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు: దవే

  • రఘురామ ఎంపీ అని రోహత్గీ పదేపదే చెప్తున్నారు, చట్టం అందరికీ ఒక్కటే: దవే
  • ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు: దవే
  • బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు చెప్పింది: దవే
  • ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీంకోర్టు ఎలా వస్తారు?: దవే
  • ఆర్మీ ఆస్పత్రి నివేదికపై అభ్యంతరం లేదు: ప్రభుత్వ తరఫు న్యాయవాది
  • జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైందే: దుష్యంత్ దవే
  • ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని దవేను ప్రశ్నించిన ధర్మాసనం
  • సమయం ఎక్కువగా లేదని గుర్తు చేసిన ధర్మాసనం
  • రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు కనుక విచారణ మంగళవారానికి వాయిదా వేయాలన్న దవే
  • ఆస్పత్రికి అంబులెన్సులో తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారు: దవే
  • తన కారులో ఆస్పత్రికి వెళ్తూ అభివాదం చేసి కాలి గాయాలు చూపించారు: దవే

15:06 May 21

గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి: దవే

  • వాదనలు ప్రారంభించిన ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే
  • ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు: ప్రభుత్వ తరఫు న్యాయవాది
  • ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు: దవే
  • గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి: దవే
  • హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు: దవే
  • అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ ఇక్కడ పిటిషన్ ఎలా వేస్తారు?: దవే
  • రెండువర్గాలను రెచ్చగొట్టేలా రఘురామ మాట్లాడారు: దవే
  • కరోనా వేళ ఇదంతా సరికాదని రఘురామకు సమయం ఇచ్చాం: దవే
  • రఘురామ అన్ని హద్దులు మీరారు: ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే
  • ఎంపీకి చెందిన 45 వీడియోలు సేకరించి సీఐడీ ప్రాథమిక విచారణ చేసింది: దవే
  • కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి రేపేందుకు యత్నించారు: దవే
  • ఇవన్నీ రాజద్రోహం కిందకే వస్తాయి: ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే
  • ప్రభుత్వ అఫిడవిట్ కాపీని చదివి వినిపిస్తున్న దుష్యంత్‌ దవే

14:57 May 21

'బెయిల్ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారు'

  • రఘురామ బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు విచారణ
  • ఎంపీ రఘురామ వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు
  • ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు
  • బెయిల్ పిటిషన్‌పై రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సీఎం కక్షపూరిత చర్యలకు దిగారు: రోహత్గీ
  • జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేశారని రఘురామపై కక్ష: రోహత్గీ
  • జగన్ ప్రతివాదిగా లేనందున దీనిలోకి లాగొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది
  • పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది చెబుతానన్న రోహత్గీ
  • ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగువులాడుకుంటున్నారని మందలించిన ధర్మాసనం
  • బెయిల్ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారు: రోహత్గీ
  • అరెస్టు, మెజిస్ట్రేట్, హైకోర్టు విచారణ పరిణామాలు వివరించిన రోహత్గీ
  • ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ప్రస్తావిస్తున్న ముకుల్‌ రోహత్గీ

13:02 May 21

ప్రాక్చర్ అస్పష్టంగా ఉంది: దవే

ఎంపీ రఘురామ బెయిల్‌, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైద్య పరీక్షలపై ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక సుప్రీం కోర్టుకు అందింది. ముగ్గురు వైద్యులు పరీక్షించిన ఎక్స్-రే, వీడియో కూడా పంపారు. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. జనరల్ ఎడిమా, ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు నివేదికలో తేలిందన్నారు.  

రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. కస్టడీలో చిత్రహింసలు చేశారన్న ఆరోపణలు నిజమని తేలాయన్నారు. అధికారుల చిత్రహింసలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటని రోహత్గీ ప్రశ్నించారు.  

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దుష్యంత్‌ దవే..గాయాలు స్వయంగా చేసుకున్నవా ?, కాదా ? అన్నది తెలియదన్నారు. దవే వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం... స్వయంగా గాయాలు చేసుకున్నారంటున్నారా ?, ఆస్పత్రికి తీసుకెళ్లేముందు గాయాలు చేసుకున్నారా ? అని ప్రశ్నించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.  

వైద్య పరీక్షల నివేదికను ప్రభుత్వం, ఎంపీ రఘురామ న్యాయవాదులకు మెయిల్  చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారానికి వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం.. వైద్య పరీక్షల నివేదిక పరిశీలించాక మధ్యాహ్నం 2.30 గంటలకు విచారిస్తామని తెలిపింది.  

Last Updated : May 21, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.