ETV Bharat / city

RRR letter: ముఖ్యమంత్రికి రఘురామ లేఖల పర్వం.. ఈసారి 'నవ సూచనలు' పేరుతో - సీఎం జగన్​కు లేఖ రాసిన ఎంపీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఆ రాష్ట్ర ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల పర్వం కొనసాగుతోంది. నవ ప్రభుత్వ కర్తవ్యాలు ముగించి.. నవ సూచనల పేరుతో లేఖలు మెుదలుపెట్టారు. పేదవారికి జగనన్న కాలనీలు.. పక్కా ఇళ్ల విషయంపై తొలి లేఖను సంధించారు నర్సాపురం ఎంపీ.

ముఖ్యమంత్రికి రఘురామ లేఖల పర్వం.. ఈసారి 'నవ సూచనలు' పేరుతో

author img

By

Published : Jun 29, 2021, 4:13 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​కు మరోసారి లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామరాజు. తొలిసారి ఆయన పేదవారికి జగనన్న కాలనీలు.. పక్కా ఇళ్ల విషయంపై లేఖ సంధించారు. ఏపీ వ్యాప్తంగా 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్లాన్ చేశారని తెలిపారు. ముందుగా దీనికి రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి.. ఆ తర్వాత దాన్ని రూ.70,000 కోట్లకు పెంచారని లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలో పనులను మీరు వర్చువల్ విధానంలో జూన్ 3న ప్రారంభించారని గుర్తు చేశారు. వచ్చే నెల 4న ప్రముఖ మీడియాల్లో అద్భుతమైన ప్రకటనలు ఇచ్చి మరో కార్యక్రమం ద్వారా మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నారని లేఖలో ప్రస్తావించారు.

ఇలా వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు ఇలా చేసినట్లుగా గుర్తుందన్న ఎంపీ.. ఇన్నిసార్లు విడతల వారీగా శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల సినిమాలోని ''మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ'' డైలాగ్ గుర్తుకు వస్తోందని లేఖలో విమర్శించారు. అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదన్న రఘురామ.. గత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లు నిర్మించి ఇస్తే.. మీరు గత 24 నెలలుగా వారికి ఇళ్లు అందజేయకుండా వారిని నిత్యం ఎందుకు వేధిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. మీకే పేరు రావాలని మీరు అనుకుంటున్నా.. గత ప్రభుత్వం ఆ ఇళ్లను నిర్మించింది కూడా ప్రజల డబ్బుతోనే అనే విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మీరు ఇలా చేయడం సబబుగా అనిపించడం లేదని.. మీరే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.