ETV Bharat / city

RRR LETTER: 'తెలుగు రాష్ట్రాల నీటి వివాదాన్ని పరిష్కరించండి' - ఏపీ తెలంగాణ నీటి వివాదాల అప్​డేట్స్

తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఏపీ ఎంపీ రఘురామ కేంద్రమంత్రి షెకావత్​కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తేలే వరకు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండేలా చూడాలని కోరారు.

'తెలుగు రాష్ట్రాల నీటి వివాదాన్ని పరిష్కరించండి'

author img

By

Published : Jul 6, 2021, 6:02 PM IST

ఇరు రాష్ట్రాల నీటి వివాదంపై.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తేలే వరకు, సయోధ్య కుదిరే వరకు.. కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండేలా చూడాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామ కోరారు. నీటి వివాదాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు అదుపు తప్పి.. శాంతి భద్రతల సమస్య రాకుండా తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. నీటి పంపిణీ చాలా సున్నితమైన అంశమని.. ప్రాంతాల మధ్య చిచ్చు రగిలే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నీరు, విద్యుత్ పంపిణీ బాధ్యతలు కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని విన్నవించారు.

ఇదీ చూడండి: నీటిపారుదల శాఖపై కేసీఆర్ సమీక్ష.. ఏపీ ప్రాజెక్టుల అంశంపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.