అన్యమతస్థులకు డిక్లరేషన్ విధానం అక్కర్లేదని తితిదే ఛైర్మన్ చెప్పట్టాన్ని ఎంపీ రఘురామకృష్ణ తప్పుబట్టారు. దివగంత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి వ్యక్తులు వచ్చినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్... తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పారు. ఆయన ఎందుకు అలా చేశారో తనకు తెలియదన్నారు.
తిరుమలలో నిబంధనలను మార్చేందుకే సొంత బాబాయ్ ను ఛైర్మన్ గా పెట్టారని కొందరూ నాతో చెబుతున్నారు. కానీ సీఎం లౌకికవాది అని నేను అనుకుంటున్నాను. తితిదే ఇవాళ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. ఛైర్మన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఇలాంటి నిర్ణయాలతో హిందూలోకం మొత్తం ఘోషిస్తోంది. తితిదే డబ్బులను బాండ్ల రూపంలోకి మార్చడమేంటి..?ఇదే నిర్ణయం అమలైతే రాష్ట్రం రాష్టంలా ఉండదు ముఖ్యమంత్రి గారూ. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. తితిదే ఆలయ నిబంధనలు, నమ్మకాలను యధావిధిగా అమలుపరచాలి.
- రఘురామకృష్ణరాజు, ఎంపీ
రాష్ట్రంలో చీఫ్ లిక్కర్ ను అధిక ధరలకు అమ్ముతూ... ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురి కోసం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని... రోడ్ల టెండర్లన్నీ ఒకే సామాజిక వర్గానికి వచ్చాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు. తన మానసిక స్థితి సరిగా లేదన్నవారి మానసిక స్థితే సరిగా లేదని దుయ్యబట్టారు. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని.. తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని స్పష్టం చేశారు. త్వరలోనే తనపై చేస్తున్న కుట్రలకు సంబంధించి ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేస్తాననన్నారు.. రఘురామకృష్ణరాజు.
- ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు