ETV Bharat / city

MP RRR Press meet: 'అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దాం'

author img

By

Published : Jan 13, 2022, 5:25 AM IST

MP RRR Press meet: రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే.. అది రాజద్రోహం ఎలా అవుతుందంటూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీకి ఏడు లక్షల కోట్ల అప్పు ఉంటే.. దానిలో రూ.ఒక లక్ష కోట్లు మా ప్రభుత్వ పెద్దలు తినేశారనడంలో అతిశయోక్తే లేదని వ్యాఖ్యానించారు. పండుగకు వస్తున్నానని తెలిసే.. సీఐడీతో నోటీసులు ఇప్పించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP RRR
MP RRR
'అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దాం'

MP RRR Press meet: పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎంపీ ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు.. రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందజేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు రఘురామ తెలిపారు.

''సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ఓ బృందం మా ఇంటికి వచ్చింది. ఈనెల 17న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేపు నరసాపురానికి వస్తున్నానని కలెక్టర్‌, ఎస్పీకి ముందుగానే తెలిపాను. పండగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటి? హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ.. అది అందరికీ తెలుసు. పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా?. ఏపీ సీఐడీ, సీఎం జగన్‌కు పండగ రోజే విచారణ గుర్తొచ్చిందా? పండగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలి. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తిని నేను. కరోనా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతా. గతంలో నన్ను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవు. నన్ను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో నాకు తెలుసు. నన్ను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలి. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నాం. ఈ రావణ రాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారు. హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం. పార్టీలకతీతంగా.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం.

-ఎంపీ రఘురామకృష్ణ రాజు

రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం ఎలా అవుతుందని.. ఎంపీ ప్రశ్నించారు. ఏపీకి ఉన్న ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రూ.లక్ష కోట్లు ఏపీ ప్రభుత్వ పెద్దలే తినేశారంటూ ఆరోపించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.