సీబీఐ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏపీ సీఎం జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 'కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి' అని తాను కోరుకుంటున్నట్లు రఘురామ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగా..రహదారుల పరిస్థితిపై జగన్ తీవ్రంగా విమర్శించారని.. కానీ ఇప్పుడు అసలు రోడ్లే లేని దుస్థితి ఏర్పడిందన్నారు.
కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి. ఎన్నికల ప్రచారంలో రోడ్ల దుస్థితిపై మా సీఎం బాగా చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్లు బాగోలేదని అప్పుడు చెప్పారు.. ఇప్పుడు రోడ్లే లేవు. రోడ్లు బాగాలేక వృద్ధులు, గర్భిణులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో చేసిన ఉపాధిహామీ పనులకే బిల్లులు ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చినా రాష్ట్రం మాత్రం నరేగా బిల్లులు చెల్లించడం లేదు.
-రఘురామ, నరసాపురం ఎంపీ
ఇదీచూడండి: భవిష్యత్లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్