ETV Bharat / city

MP KOMATIREDDY: షర్మిలకు ఆల్​ ది బెస్ట్ చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి - వైఎస్ షర్మిలకు ఎంపీ కోమటిరెడ్డి ఆల్​ ది బెస్ట్

వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి నేడు శ్రీకారం చుట్టనున్నారు. షర్మిలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP KOMATIREDDY) ఆల్​ ద బెస్ట్ చెప్పారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ నుంచి వెళ్తున్న కోమటిరెడ్డి(MP KOMATIREDDY).. అక్కడ కాసేపు ఆగి.. వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు.

MP Komatireddy venkat reddy
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
author img

By

Published : Jul 8, 2021, 12:23 PM IST

వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె తెలంగాణలో పెట్టబోతున్న రాజకీయ పార్టీకి నేడు శ్రీకారం చుట్టనున్నారు. షర్మిలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP KOMATIREDDY) ఆల్​ ది బెస్ట్ చెప్పారు.

జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద నుంచి వెళ్తున్న వెంకట్ రెడ్డి(MP KOMATIREDDY).. అక్కడ కాసేపు ఆగి వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. ఆయణ్ను పార్టీ ప్రారంభానికి ఆహ్వానించినట్లు వైఎస్సార్టీపీ శ్రేణులు తెలిపాయి. వైఎస్సార్ గొప్పనేత అంటూ కొనియాడినట్లు వెల్లడించాయి. అక్కణ్నుంచి భువనగిరిలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్తున్నట్లు వెంకట్ రెడ్డి(MP KOMATIREDDY) చెప్పారని వైఎస్సార్ అభిమానులు తెలిపారు.

రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీని(YSRTP) ఇవాళ ప్రకటించనున్నారు. ముందుగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద పార్టీ(YSRTP) జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు.

పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకుంటారు షర్మిల. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్‌ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ(YSRTP) జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ(YSRTP) స్థాపన లక్ష్యాలు, అజెండాపై గంటా 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.