ETV Bharat / city

ఆ విషయం నాకు ముందే తెలుసు.. వీడియోను పెద్దగా పట్టించుకోలేదు: గోరంట్ల మాధవ్‌ - ఎంపీ మాధవ్ వీడియో

Gorantla Nude Video Issue: సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన న్యూడ్ వీడియో వంద శాతం ఫేక్ అని తాను గతంలోనే చెప్పానని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. వీడియో వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసునని చెప్పారు. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.., అది సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.

mp-gorantla-madhav-clarification-on-nude-video

author img

By

Published : Aug 10, 2022, 6:03 PM IST

Gorantla Nude Video Issue: న్యూడ్ వీడియో వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసునని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియో వందశాతం ఫేక్ అని తాను గతంలోనే చెప్పానన్నారు. వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వివరాలు వెల్లడించిన అనంతరం.. మాధవ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టెందుకే ఇలాంటి పనులు చేశారన్నారు. ఆ వీడియోను తాను పెద్దగా పట్టించుకోలేదని.. అది వైరల్ అయ్యాక కూడా తన పనులను చేసుకున్నానని తెలిపారు. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.., అది సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.

"వందశాతం ఫేక్ వీడియో అని గతంలోనే చెప్పా. వీడియో సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా. వీడియోపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. నాపైనే ఎందుకు వీడియో చేశారో దాన్ని సృష్టించిన వారినే అడగాలి. వీడియోపై నిజానిజాలు తేల్చాలని పోలీసులను కోరా. నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి పనులు." -గోరంట్ల మాధవ్‌, వైకాపా ఎంపీ

అప్పటి వరకు తేల్చలేం..: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒరిజినల్ కానందున దానిపై స్పష్టతకు రాలేమని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప వెల్లడించారు. సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు షేర్‌ చేయడం వల్ల అది ఎడిటింగ్, మార్ఫింగ్‌ అయ్యిందో లేదో చెప్పలేకపోతున్నామన్నారు. ఒరిజినల్ వీడియో దొరికేంత వరకూ అందులో ఉన్నది ఎంపీనేనా ? కాదా ? అనేది తేల్చలేమని తెగేసి చెప్పారు. వీడియో మొదటగా ఓ లండన్‌ నెంబర్ నుంచి ఫార్వర్డ్ అయ్యిందన్న ఎస్పీ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఎంపీ మాధవ్ అభిమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. ఎంపీ నుంచి కానీ, బాధితురాలి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదూ అందలేదని స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే ఆమె నుంచి వీడియోను సేకరించి వెంటనే తేలుస్తామన్నారు.

విషయం ఏంటంటే..: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఈనెల 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.