మచ్చలేని కేసీఆర్పై కాంగ్రెస్ నిందలు వేయడం సిగ్గుచేటని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ను జైలుకు పంపిస్తామని మాణికం ఠాకూర్ అనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్కు ఎప్పుడూ.. అధికారం, జైలుపైనే ధ్యాసన్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా.. మోకాళ్లపై నడిచినా ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కదన్నారు. తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్.. సీఎం పదవిని కించపరిచేలా మాట్లాడారన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని బడుగుల అన్నారు. తెలంగాణ తెచ్చిన పేరే తనకు గొప్పదని.. సీఎం పదవి తనకు తృణపాయం అన్నారని స్పష్టం చేశారు. ఎడమ కాలితో, చెప్పుతో పోల్చారనేది అబద్దమన్నారు.
ఇదీ చూడండి: 'లక్ష అడుగులతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు'