తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయొద్దని కేసీఆర్‌కు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండాను అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆవిష్కరించారు. ప్రాణం ఉన్నంత వరకు గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. విద్వేష ఉపన్యాసాలు చేస్తున్నానని కేసులు పెట్టినా భయపడనన్నారు.
2020లో దిల్లీ మరో మారణ హోమానికి వేదికయ్యిందని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల నుంచి మోదీ పాఠాలు నేర్చుకుని ఉంటారనుకున్నానని ఎద్దేవా చేశారు. చనిపోయిన వారంతా భారతీయులేనని.. బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధుల ఒకనెల జీతం విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీచూడండి: దిల్లీలో అల్లర్లకు కారణమదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి