ETV Bharat / city

కేటీఆర్​పై ఎంపీ అసదుద్దీన్​ ఆసక్తికర ట్వీట్​

కేటీఆర్​పై ఎంపీ అసదుద్దీన్​ ఆసక్తికర ట్వీట్​ చేశారు. మళ్లీ ఆయన్ను ప్రభుత్వంలో భాగస్వామిగా చూడాలనుకుంటున్నట్లు ట్వీట్టర్​ వేదికగా వెల్లడించారు.

author img

By

Published : Aug 26, 2019, 2:53 PM IST

కేటీఆర్​పై ఎంపీ అసదుద్దీన్​ ఆసక్తికర ట్వీట్​

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ ఆసక్తికర ట్వీట్​ చేశారు. కేటీఆర్​ను మళ్లీ ప్రభుత్వంలో భాగస్వామిగా చూసేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్​ చేశారు. గతేడాది ఒప్పో.. ఇటీవల అమెజాన్.. ఇవాళ వన్​ప్లస్​తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ పాత్రికేయుడి ట్వీట్​పై అసదుద్దీన్​ స్పందించారు. ఆ ఘనత కేటీఆర్​దేన్న ఎంఐఎం అధినేత.. ఆయనను మంత్రిగా చూసేందుకు వేచిచూస్తున్నట్లు తెలిపారు. స్పందించిన కేటీఆర్​.. ఎంపీ అసదుద్దీన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: ఖైరతాబాద్ గణేశ్​ మండపాన్ని సందర్శించిన మంత్రి తలసాని

TG_Hyd_23_26_Minister_Mayor_Visit_Khairathabad_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq ( ) ప్రపంచమంతా హైదరాబాద్ వినాయక నిమజ్జనం వైపు చూస్తోందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అధికారుల ఆధ్వర్యంలో లోతైన ప్రదేశంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేస్తామన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందని తెలిపారు. అందరూ భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నగరంలో నిమజ్జనం కోసం 32 కొలనులను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వివరించారు. బైట్: తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి బైట్: బొంతు రామ్మోహన్ , నగర మేయర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.