ETV Bharat / city

Arvind Dharmapuri: తెరాసలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతోంది: అర్వింద్ - huzurabad election results

హుజూరాబాద్​లో భాజపా విజయం కోసం కృషి చేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అభినందనలు తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు తెరాస చేసిన అన్ని ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఈ గెలుపుతో.. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పతనానికి నాంది పడిందని వ్యాఖ్యానించారు.

MP Arvind Dharmapuri comments on huzurabad by election winning

author img

By

Published : Nov 2, 2021, 5:33 PM IST

'హుజూరాబాద్​ గెలుపుతో.. తెరాస పతనానికి నాంది పడింది'

తెరాస పతనానికి నాంది పడిందని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించారు. తెరాస పార్టీలో పెద్దఎత్తున ముసలం పుట్టబోతోందని దిల్లీలో జోస్యం చెప్పారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో భాజపా విజయం కోసం పనిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు అర్వింద్​ అభినందనలు తెలిపారు. ఎన్ని రకాలుగా భాజపాను అడ్డుకున్నా.. చివరికి గెలుపు జెండా ఎగరేసి తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పారు.

"భాజపాకు 15 వేల నుంచి 20 వేల మెజార్టీ రానుంది. డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామని తెరాస అనుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో కేసీఆర్​కు తగిన బుద్ధి చెప్పారు. నోట్ల కట్టలతో గెలుద్దామనుకున్న కేసీఆర్​కు ఈ గెలుపు ఓ చెంపపెట్టు. పోలీలసులతో, అధికార యంత్రాంగంతో, డబ్బు ప్రవాహంతో.. భాజపాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెరాస పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. కేసీఆర్​ శకం త్వరలోనే ముగియనుంది. కేటీఆరే.. కేసీఆర్​కు వెన్నుపోటు పొడవనున్నారు. పార్టీలో పెద్దఎత్తున ముసలం పుట్టబోతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రాబోతోంది. బంగారు తెలంగాణ అన్న మాట.. ప్రధాని నరేంద్రమోదీ నాయత్వంలోనే సాధ్యం కానుంది. హుజూరాబాద్​లో ఈటల గెలుపు.. ఆ నియోజకవర్గంలోని ప్రజలందరి విజయం. భాజపా గెలుపుబావుటా ఎగరేసేందుకు కష్టపడిన ప్రతీఒక్క కార్యకర్తకు నా అభినందనలు." - ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ.

ఇదీ చూడండి:

Etela Rajender leads : మొదటి నుంచి ఈటలదే జోరు.. ఏఏ రౌండ్​లో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.