దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే గ్రేటర్‌లోనూ పునరావృతమవనున్నట్లు ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లలో భాజపా ఎన్నికల కార్యాలయాలను ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొవిడ్-19 విపత్కర సమయంలో బ్యాంకు అకౌంట్లలో నగదు వేసిన మాదిరిగా... వరద సాయం కూడా అందజేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
వరద బాధితులకు బాహాటంగా రూ. 10 వేలు అందించి... ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. పేద ప్రజలకు నగదు సాయం చేస్తామంటే... తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు. పేద ప్రజలను ఆదుకోవడమే తమ పార్టీ లక్ష్యమని జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బల్దియాలో డిజిటల్ ప్రచారం.. సోషల్ వారియర్స్ దూకుడు