ETV Bharat / city

'దళితులకు సీఎం కేసీఆర్​ అన్యాయం చేస్తున్నారు' - hyderabad latest news

హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో డా. అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు, మోత్కుపల్లి నర్సింహులు... అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్... ఒక్క దళితనేత విగ్రహానికి కూడా పూల మాల వేయలేదని మోత్కుపల్లి ఆరోపించారు.

'దళితులకు సీఎం కేసీఆర్​ అన్యాయం చేస్తున్నారు'

author img

By

Published : Dec 6, 2020, 3:06 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారని.... భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. డా.బాబాసాహెబ్​ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్​రావు సహా పలువురు భాజపా నేతలు పాల్గొని.. అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

సీఎం కేసీఆర్ అగ్రకులాల వారికి మాత్రమే మంత్రి పదివిని కట్టబెట్టారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్... ఒక్క దళితనేత విగ్రహానికి పూల మాల వేయలేదని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని సైతం గాలికి వదిలేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.