అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జేసీబీతో కూల్చేందుకు వెళ్లి ఓ కుటుంబాన్ని ఖాళీ చేయాలని ఆదేశించగా ముగ్గురు పిల్లలపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
తమకు చాలా ఏళ్లుగా ఇల్లు ఇక్కడే ఉందని... వరదలకు కూలిపోయిన గోడలు మాత్రమే కట్టినట్లు వారు తెలిపారు. అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మరో 4 రూంలను
అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలను కూలగొట్టాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలు తగ్గించేందుకు సన్నాహాలు