ETV Bharat / city

అనారోగ్యంతో కుమారుడు మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె - ap updates

అనారోగ్యంతో ఉన్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు... ఆ వార్త విన్న తల్లి గుండె ఆగింది. గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారుడు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

mother dies after hearing news of sons death in eleswram nailepeta at east godavari district
కుమారుడు చనిపోయాడనే వార్త విని తల్లి మృతి
author img

By

Published : Jun 19, 2020, 5:32 PM IST

కుమారుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు... నయమై త్వరలోనే ఇంటికి వస్తాడు అని అనుకుందా తల్లి... కానీ ఆ తల్లి ఆశలు అడియాశలు చేస్తూ... అమ్మా ఇక సెలవంటూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. నీవు లేని జీవితం నాకొద్దు కన్నా అని ఆ తల్లీ ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నెయిలీపేటలో జరిగింది.

ఏలేశ్వరం నెయిలీపేటకు చెందిన సీతారాం అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... గురువారం రాత్రి మృతిచెందాడు. కుమారుని మరణ వార్త విన్న తల్లి మంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారులు చనిపోవటంతో కుటుంబ సభ్యుల వేదన అంతాఇంతా కాదు.

ఇదీ చదవండి:విషాదం : నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.