వీధి వ్యాపారులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, బ్యాంకర్స్, సీసీఐ, మార్క్ ఫెడ్ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రధాని అవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. కేంద్రం నిధులను సైతం 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికే వెచ్చిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 4 రకాల వడ్డీ రాయితీలు కల్పిస్తోంది. హైదరాబాద్‌లో సొంత స్థలం ఉన్నవారికి రాయితీతో కూడిన రుణాలు కేంద్రం ఇస్తుంది. - కిషన్రెడ్డి, కేంద్ర హోం శాఖ సహామ మంత్రి.
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో 168 బస్తీ దవాఖానాలను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. వీటి నిర్వహణకు నిధులు కేంద్రమే సమకూరుస్తుందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, తేమ శాతంపై రైతులను మరింత చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువుల సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు
దేశంలో ఈసారి పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడు కేంద్రాలుగా సీసీఐ పనిచేస్తోందని వివరించారు. గతేడాది 258 మిల్లుల్లో పత్తిని కొనుగోలు చేశారని తెలిపారు. ఈ ఏడాది ఎక్కువ మిల్లుల్లో కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల చివరిలో కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని కిషన్రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు