ప్రభుత్వ విభాగాలన్నీ ఒకే ప్రాంగణంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా నిర్మించిన మరో ఎనిమిది కలెక్టరేట్ భవన సముదాయాలు సిద్ధమయ్యాయి. ఇటీవల కామారెడ్డి, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట భవన సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. తాజాగా నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, యాదాద్రి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా కలెక్టరేట్లు శ్రావణ మాసంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సీఎం సమయం తీసుకునే పనిలో ఉన్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, జగిత్యాలలో మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలూ సిద్ధంగా ఉండటంతో ఒకేదఫా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యక్తిగత గోప్యత.. గాలిలో దీపం!