ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా... 1,413 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. ఏపీలో మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు.. 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. ఏపీలో ప్రస్తుతం 19,549 క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో... ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!