ETV Bharat / city

నడి సముద్రంలో వానరం.. మూడు నెలలుగా అక్కడే.. చివరకు..

Monkey Stuck in Sea: నడి సముద్రంలోకి ఎలా వెళ్లిందో తెలీదు కానీ.. ఓ వానరం మూడు నెలల నుంచి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసింది. తిరిగి రావటానికి దారి లేక అక్కడే కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద రోజులు గడిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తాము తినగా మిగిలిన ఆహారం అందిస్తుండటంతో ఇన్నాళ్లు ప్రాణాలు దక్కించుకుంది. చివరికి ఒడ్డుకు ఎలా చేరుకుందంటే..?

monkey on the  sea
monkey on the sea
author img

By

Published : Mar 27, 2022, 9:21 AM IST

Monkey Stuck in Sea: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ హార్బర్‌కు దాదాపు మూడు నాటికల్‌ మైళ్ల దూరంలో ఓ వానరం చిక్కుకుంది. చుట్టూ నీళ్లు ఉన్నా అక్కడకు ఎలా చేరుకుందో తెలీదు. అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గం లేక బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీసింది. కెరటాలను అదుపులో ఉంచేందుకు సముద్రంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్‌ వేవ్‌ బ్రేకర్ల పైనే ఈ మూడు నెలలు కాలం గడిపింది. అటుగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తాము తిన్న ఆహారంలో కొంత ఆ వానరానికి అందివ్వటంతో కడుపు నింపుకుంది. తాగటానికి నీళ్లు లేక కాంక్రీట్‌ వేవ్‌ బ్రేకర్ల మీద వేడి వాతావరణంలో అవస్థలు పడుతున్న వానరం దుస్థితి చూసి మత్స్యకారుల మనస్సు చలించింది.

ప్రకాశం జిల్లా కొత్తపట్టణంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్ సొసైటీ హెల్ప్ లైన్‌కు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సంజీవ్‌ వర్మ, అమర్‌నాథ్, మనీశ్, రామకృష్ణలతోపాటు హైదరాబాద్‌లో వానరాలపై ప్రత్యేకంగా పనిచేసే సంతోషి, అనిరుథ్, కాకినాడ యానిమల్‌ రెస్క్యూ బృందం పడవల్లో వానరం వద్దకు చేరుకొని దాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. తొలి రెండు రోజులు వానరం చిక్కకపోవటంతో మూడోజైన శనివారం అతికష్టం మీద వానరాన్ని బోనులో బంధించి ఒడ్డుకు చేర్చారు. అక్కడ నుంచి కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయానికి తరలించి దట్టమైన చెట్ల పొదల్లో విడిచిపెట్టారు.

నడి సముద్రంలో వానరం.. మూడు నెలలుగా అక్కడే.. చివరకు..

ఇదీ చదవండి : 'ధాన్యం కొనుగోలుపై.. ప్రధానికి నేటి నుంచి తీర్మానాల ప్రతులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.