కోతులను చూడగానే కుక్కలు అరుస్తూ వెంటాడుతాయి. దీనికి భిన్నంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో ఓ కుక్క, కోతి వైరం మరిచి తిరుగుతున్నాయి. స్నేహంగా జీవిస్తున్నాయి. కోతి పుట్టిన కొన్ని రోజులకు దాని తల్లి చనిపోయింది. గాయాలతో ఉన్న బుల్లి వానరాన్ని స్థానికంగా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న శిరిగిన పాపారావు, వెంకటచౌదరి చేరదీసి చికిత్స చేయించారు.
వారు పెంచుకుంటున్న ఓ శునకం దీన్ని అక్కున చేర్చుకుని తనతోపాటే తిప్పుతోంది. మిగిలిన కోతులను చూసి .. ఈ వానరం కుక్క వద్దే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి.
ఇదీ చదవండి : సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ తాజా వైఖరిని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్