ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఓ వానరం.. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. మనుషులకు ఏ మాత్రం తీసిపోకుండా.. రుచులను ఆస్వాదిస్తోంది. ఎవరి దగ్గర ఎత్తుకొచ్చిందో గానీ.. ఓ పిట్ట గోడపై కూర్చుని... పల్లీలు తింటూ.. కూల్ డ్రింక్ తాగుతూ.. ఇలా కెమెరాకు చిక్కింది.
ఆ వానరం చేష్టలకు అక్కడున్న వారంతా కాసేపు నవ్వుకున్నారు. అనుభవించు రాజా.. అంటే ఇలాగే అన్నట్టుగా ప్రవర్తించిన ఆ కోతిని చూసి ముచ్చటపడ్డారు.
ఇదీ చదవండి: కొత్త రూల్- చిన్న పిల్లలకు కేక్, ఐస్‌క్రీమ్ బంద్!