ETV Bharat / city

పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా... - monkey

కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినేందుకు ఓ కొండముచ్చు రోజూ వస్తోంది. విద్యార్థులతో తరగతి గదుల్లో కూర్చోవడమేగాక... అందరితోపాటే మధ్యాహ్న భోజనం తింటోంది. పాఠశాల ముగిశాక బాధతో స్నేహితులకు వీడ్కోలు పలికినట్లుగా అందర్నీ కౌగిలించుకుని మరీ వెళ్లిపోతోంది.

monkey
author img

By

Published : Jul 30, 2019, 10:35 AM IST

పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా...

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగలాంపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతోపాటు ఓ కొండముచ్చు రోజూ తరగతులకు హాజరవుతోంది. సమీపంలోని కొండల్లో నివసించే ఈ వానరం కొన్నిసార్లు రోజంతా పాఠశాలలోనే గడుపుతోంది

సాధారణంగా కోతిని చూస్తే పిల్లలు హడలిపోతారు. లేదా దాన్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కొండముచ్చు కొద్దిరోజుల్లోనే పిల్లలకు స్నేహితుడిలా మారిపోయింది. బడికి వచ్చింది మొదలు పిల్లలతో ఆటలు మొదలెడుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటే మాత్రం గోల చేయకుండా పాఠాలు వింటోంది.

పిల్లలను ఏమీ అనకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం వల్ల ఉపాధ్యాయులూ దాన్ని తరిమేయలేదు. అంతేగాక తననీ ఓ విద్యార్థిగా భావించి పాఠాలు చెబుతున్నారు.

ఆదివారం పాఠశాలకు వచ్చి విద్యార్థులు ఎవరూ లేకపోయేసరికి నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంది. మిగిలిన రోజుల్లో కొండముచ్చుకు టాటా చెప్పనిదే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటికిపోరు. అందరికీ వీడ్కోలు పలికాక కొండల్లోకి నడుచుకుంటూ పోతుందీ కొండముచ్చు.

ఇదీ చూడండి: ఎస్సైకి ముద్దిచ్చాడు.. అరెస్ట్ అయ్యాడు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_29_BJP_Gensec_On_Stategovt_AVB_AP10004

Body:ఇసుక కొత్త విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ను రోడ్డున పడేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను తప్పు పట్టారు. గడిచిన అయిదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన బాటలోనే వైకాపా ప్రభుత్వం నడుస్తోందని సురేష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతులకు పొంతన లేదు అన్నట్లుగా పాలన సాగుతోందన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లంచాలు తీసుకుంటూ అవినీతికి బాటలు వేస్తోంది అని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చుకోని పక్షంలో లో తెదేపా కి పట్టిన గత వైకాపాకు తప్పదని హెచ్చరించారు. నీతిమంతమైన పాలనతో దేశ ప్రజల మనుషుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 లో ఆంధ్రప్రదేశ్ లోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని సురేష్ రెడ్డి అన్నారు.

Conclusion:బైట్
సురేష్ రెడ్డి, రాష్ట్రప్రధాన కార్యదర్శి,భాజపా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.