రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఆస్తులను సంరక్షిస్తూనే.. వాటి ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. వక్ఫ్ ఆధినంలోని భవనాలు, కాంప్లెక్సులు, ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో పేద ముస్లింలకు చేయూతనందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బోర్డు సభ్యులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాల్లోని ఆస్తుల అద్దె బకాయిల వసూలు, భవనాల మరమ్మతులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం 28 మేనేజింగ్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మసీదు, దర్గాల నిర్వహణకు ఆరుగురు మౌత్వాలీలను నియమించినట్టు తెలిపారు. కొత్తగా రెండు ఆస్తులను వక్ఫ్ రికార్డుల్లో చేర్చి.. రెవెన్యూశాఖకు అందజేసినట్లు సలీం వివరించారు.
ఇదీ చూడండి: సినిమా హాళ్ల నిర్మాణంపై ఇంధనశాఖ కొత్త ఉత్తర్వులు