లాక్‌డౌన్ నేపథ్యంలో నివాస ప్రాంతాలకే మొబైల్ రైతు బజార్ రావడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వ్వాప్తిని నియంత్రించడానికి ప్రజలు సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో మెహిదీపట్నం మార్కెట్ అధికారులు మొబైల్ రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. ముషీరాబాద్ గాంధీ నగర్‌లోని ఎస్బీహెచ్ కాలనీలో మొబైల్ రైతుబజార్ వాహనాన్ని నెలకొల్పారు. స్థానికులు సామాజిక దూరాన్ని పాటిస్తూ అవసరమైన కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు విన్నవించుకున్నారు.
ఈ రైతు బజార్‌లో కూరగాయలు సరసమైన ధరకు లభిస్తున్నాయని... ఈ సదుపాయాన్ని అన్ని కాలనీల్లో అందుబాటులో ఉండేలా చూడాలని మార్కెట్ నిర్వాాహకుల్ని పలువురు కోరారు.
ఇదీ చూడండి: జీవన్మరణ పోరాటంలో విజయం తథ్యం