ETV Bharat / city

"ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం" - mlc narsireddy

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.

"ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి"
author img

By

Published : Sep 4, 2019, 5:07 PM IST

"ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి"

రాష్ట్రంలో గత నెలరోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు. ఐఆర్ సాధనకు , సీపీఎస్ రద్దుకు ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ఈ సమస్యలపై ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలన్నారు. 2018 మే 16న సంఘాలతో జరిగిన సమావేశంలో జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తామని , ఆగస్టు 15 నుంచి మొదటి పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని... ఏడాది దాటినప్పటికీ వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలని , కొత్త జోన్ల ప్రకారం పదోన్నతులు కల్పించి, ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యావాలంటీర్లను నియమించాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: "తెలంగాణ రాకుంటే నీటికి అవస్థలు పడేవాళ్లం"

TG_Hyd_44_04_Mlc Narishi Reddy On Govt_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) రాష్ట్రంలో గత నెలరోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు. ఐఆర్ సాధనకు , సీపీఎస్ రద్దుకు ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ హైదర్ గూడ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ సమస్యలపై ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని కోరారు. 2018 మే 16న సంఘాలతో జరిగిన సమావేశంలో జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తామని , ఆగస్టు 15 నుండి మొదటి పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని... ఏడాది దాటినప్పటికి వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రెగ్యులర్ ఉద్యోగులు , ఉపాద్యాయులతో పాటు కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఐఆర్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలని , కొత్త జోన్స్ ప్రకారం పదోన్నతుల కల్పించి , ఉపాధ్యాయులు కొరత ఉన్న చోట విద్యావాలంటీర్లను నియమించాలని , కాంట్రాక్టు అధ్యాపకులు , ఉపాధ్యాయులను రెగ్యులర్ చెయ్యాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ , ఉపాధ్యాయ సమస్యలపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని ఆయన హెచ్చరించారు. బైట్: నర్సిరెడ్డి, ఉపాద్యాయ ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.