రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని... ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వైశ్య లైమ్ లైట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వివిధ వ్యాపార రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు అందజేశారు. భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని గుర్తుచేసుకున్న కవిత.. ఆయన సతీమణికి అవార్డు అందజేశారు. ఎంటర్‌ప్రిన్యూయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎర్రం విజయ్ కుమార్, మానిఫాక్చర్ ఆఫ్ ద ఇయర్ జయదేవ్, రిటైల్ ఛైన్ ఆఫ్ ద ఇయర్ నమశివాయా, ఎన్ఆర్ఐ ఎంటర్‌ప్రిన్యూయర్ ఆఫ్ ద ఇయర్ మహేష్ బిగాల, లెగసి బిజినెస్ హౌస్ ఆఫ్ ద ఇయర్ అంబికా కృష్ణకు అవార్డులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
"2014 నుంచి రాష్ట్రంలో దాదాపు 18 వేల కొత్త వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. 2 లక్షల 62 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరికాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది." - కవిత, ఎమ్మెల్సీ
ఇవీ చూడండి: