ETV Bharat / city

స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ రాష్ట్ర చీఫ్​ కమిషనర్​గా ఎమ్మెల్సీ కవిత - Scots and Guides chief Commissioner kavitha

స్కౌట్స్​ ​ అండ్​ గైడ్స్​ రాష్ట్ర చీఫ్​ కమిషనర్​గా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్నికయ్యారు. స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ చీఫ్​ ప్యాట్రన్​, గవర్నర్​ తమిళిసై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

mlc Kavita elected as Chief Commissioner of the telangana for Scots and Guides
స్కాట్స్​ అండ్​ గైడ్స్​ రాష్ట్ర చీఫ్​ కమిషనర్​గా ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Apr 3, 2021, 5:34 AM IST

Updated : Apr 3, 2021, 7:59 AM IST

స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ రాష్ట్ర చీఫ్​ కమిషనర్​గా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్​లోని స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కవిత విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి ప్రకటించారు.

2015లో కవిత చీఫ్​ కమిషనర్​గా తొలిసారి ఎన్నికయ్యారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. స్కౌట్స్​ అండ్​ గైడ్స్​లో విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని చెప్పారు. స్కౌట్స్ అండ్​ గైడ్స్​ చీఫ్​ ప్యాట్రన్​, గవర్నర్​ తమిళిసైతో కలిసి స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ సేవలను మరింత విస్తరిస్తామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు గవర్నర్​ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో స్కౌట్స్ అండ్​ గైడ్స్ సంఖ్య మరింత పెంచుతూ ప్రజలకు మరింతగా సేవలందించాలని కవితకు సూచించారు.

ఇవీచూడండి: తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్నపై దొంగ ఓటు కేసు

Last Updated : Apr 3, 2021, 7:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.