ETV Bharat / city

'ఫీల్డ్​ అసిస్టెంట్లను ఆరు నెలలుగా ప్రభుత్వం దూరం పెట్టింది'

author img

By

Published : Sep 10, 2020, 11:55 AM IST

ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్​ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారిని ఆరు నెలలుగా ప్రభుత్వం దూరం పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తెలిపారు. లాక్​డౌన్​ ప్రారంభమైన నాటి నుంచి వారంత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారందరిని విధుల్లోకి తీసుకోవాలని శాసన మండలిలో ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు.

'ఫీల్డ్​ అసిస్టెంట్లను ఆరు నెలలుగా ప్రభుత్వం దూరం పెట్టింది'
'ఫీల్డ్​ అసిస్టెంట్లను ఆరు నెలలుగా ప్రభుత్వం దూరం పెట్టింది'

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు పర్యవేక్షించే ఫీల్డ్​ అసిస్టెంట్లు నిబంధనల్లో మార్పులు చేయాలి. ఈ పథకానికి కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. ఆ పనులను పర్యవేక్షించేది రాష్ట్ర ప్రభుత్వమే. కరోనా పరిస్థతుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో మనం ఉపాధి పొందుతున్నామంటే అది ఉపాధి హామీ పథకం ద్వారానే. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనే భావనతో వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి వారంతా.. ఓ వారం రోజుల పాటు పనులకు హాజరుకాలేకపోయారు. లాక్​డౌన్ అమలు లోకి వచ్చిన వెంటనే వారు విధులకు హాజరు కావడానికి ప్రయత్నించారు. వారందరిని ప్రభుత్వం దూరం పెట్టింది. దశాబ్ద కాలం నుంచి పనులు చేస్తున్న వారు కరోనా పరిస్థితుల్లో పనులకు దూరమయ్యారు. వారందరిని తొలగించారు. వారికి ఇంత పెద్ద శిక్ష వేయడం సబబు కాదు. సమస్య పరిష్కరించాలని సీఎంకు లేఖను మీ ద్వారా అందిస్తున్న. - జీవన్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ.

ఇవీ చూడండి:శ్రావణి కేసులో సీరియల్​ మలుపులు... కీలకంగా మారిన కాల్​ రికార్డింగ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.