ETV Bharat / city

MLC Ananthababu suspended: డ్రైవర్ హత్య కేసు.. వైకాపా నుంచి ఎమ్మెల్సీ సస్పెన్షన్‌

author img

By

Published : May 25, 2022, 10:40 PM IST

MLC Ananthababu suspended: ఏపీలో సంచలనం సృష్టించిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ సస్పెండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్​ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనంతబాబు సస్పెన్షన్‌పై వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Ysrcp MLC suspended
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు

MLC Ananthababu Suspended: ఏపీలో సంచలనం సృష్టించిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్​ ఆదేశాల మేరకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడినని అనంతబాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు అనంతబాబు సస్పెన్షన్‌పై వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఈనెల 19న జరిగిన తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హత్య జరిగిన తర్వాత ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి అనంతబాబును అరెస్టు చేయాలని పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. అంతబాబును అరెస్టు చేసేంతవరకు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం సైతం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసే క్రమంలో అనూహ్యంగా అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో అనంతబాబును విచారించారు. విచారణ అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం నిందితుణ్ని కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. 14 రోజులు రిమాండుకు తరలించారు. ప్రస్తుతం అనంతబాబు జైలులో ఉన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.