ETV Bharat / city

అమరావతిలో జరుగుతోంది ఫొటో ఉద్యమం: ఎమ్మెల్యే శ్రీదేవి

ఏపీలోని అమరావతిలో జరుగుతున్న ఉద్యమాన్ని ఫొటో ఉద్యమంగా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి అభివర్ణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో వైకాపా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.

mla undavalli sridevi opened ycp office at thullur in andhra pradesh
అమరావతిలో జరుగుతోంది ఫొటో ఉద్యమం: ఎమ్మెల్యే శ్రీదేవి
author img

By

Published : Aug 28, 2020, 4:26 PM IST

రైతు కూలీల ముసుగులో తెదేపా నాయకులు.. ఆంధ్రప్రదేశ్​లో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తుళ్లూరులో వైకాపా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అమరావతి రైతులకు కౌలు డబ్బులు వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని ఫొటో ఉద్యమంగా శ్రీదేవి అభివర్ణించారు.

రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆమె చెప్పారు. ఈ ఏడాది కరోనా వల్ల రెండు వారాలు ఆలస్యంగా కౌలు డబ్బులు చెల్లించామన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. ఇదే సమయంలో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే తుళ్లూరు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దళిత రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.

ఇవీ చదవండి: తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా కేసులు, 11 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.