ETV Bharat / city

ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు: రాజాసింగ్​ - raja singh speaks on srisailam accident

శ్రీశైలం విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం పరిశీలనకు ఎందుకు అనుమతివ్వడం లేదో సీఎం సమాధానం చెప్పాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గకుండా సీఐడి అధికారులు నిజాలు బయటకు తీయాలని కోరారు.

raja
ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు: రాజాసింగ్​
author img

By

Published : Aug 26, 2020, 11:09 PM IST

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనలో మరణించిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.5 కోట్లు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఘటనా స్థలాన్ని పరీశీలించేందుకు వెళ్లేందుకు యత్నిస్తే పోలీసులు అడ్డుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలికి ఎందుకు వెళ్లనివ్వడం లేదో సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసే కుట్ర చేసి ఉంటాయని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గకుండా సీఐడీ అధికారులు నిజాలు బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.