ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఇవాళ జరిగిన అగ్నిప్రమాదం సమయంలో స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఓ వైపు అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలు ఆర్పటానికి తీవ్రంగా కష్టపడుతోంటే... ఎమ్మెల్యే మాత్రం అక్కడ నిలబడి సిగరెట్ వెలిగించారు. ఓ వైపు మంటల్లో పొగాకు బేళ్లు తగలబడుతుంటే... బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగ వదులుతూ కనిపించారు.
మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బందికి సహకరించటం లేదా... గోదాములోని సరకు వేరేచోటికి తరలించటంపై దృష్టి సారించకుండా పొగ తాగటం విస్మయానికి గురిచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని తెలియదా లేక... తెలిసి కూడా ఉల్లంఘించారా అని స్థానికులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ బోధన.. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యాసంవత్సరం