ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఆ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. ఈ కంపెనీలో 4వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. రాత్రిపూట పంటలు నాశనం చేస్తున్న అడవిపందులను చంపితే ఫారెస్టు అధికారులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడాలని సీఎంతోపాటు అటవీ అధికారులను గతంలోనే కోరినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ: మంత్రి గంగుల