కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో శానిటేషన్ కెమికల్స్‌ను చల్లుతున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్రావు నగర్ డివిజన్లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద రసాయనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
నియోజకవర్గంలో తన వంతు బాధ్యతగా ప్రతి డివిజన్లో నిత్యావసర సరుకుల పంపిణి, పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 10వేల లీటర్ల శానిటేషన్ కెమికల్‌ను 10 వాహనాల ద్వారా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు.
ఇవీచూడండి: కరోనాకు తోడు తుపాను బీభత్సం- ఆరుగురు మృతి