ETV Bharat / city

ఆపరేషన్ తెలంగాణ: భాజపా 5 అంశాలు - bjp4telangana

తెలంగాణలో అధికారంలోకి రావడానికి భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయం అంటూ కమలదళం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలు గెలువడం వల్ల నూతనోత్సహం వచ్చింది. అప్పటినుంచి భాజపా దూకుడు ప్రదర్శిస్తోంది. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది... అందుకోసం ప్రధానంగా 5 అంశాలపై దృష్టి పెట్టింది.

bjp
author img

By

Published : Aug 25, 2019, 2:35 PM IST

Updated : Aug 25, 2019, 10:04 PM IST

ఆపరేషన్ తెలంగాణ: భాజపా 5 అంశాలు

సభ్యత్వ నమోదు

సార్వత్రిక ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలతో రాష్ట్రంలో దాదాపు 20 శాతం ఓటు బ్యాంక్​ను సాధించింది భాజపా. పార్టీ సభ్యత్వ నమోదుతో మరింత పెంచాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన షా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. 18 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవల భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించి.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఆపరేషన్ ఆకర్ష్​

రాష్ట్రంలో బలపడి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న భాజపా... అందుకు అనుగుణంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. తెరాస ఎంపీలతో పాటు మిగతా పార్టీల కీలక నేతలూ సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతోంది. గోవా, కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్, తెదేపా, తెరాస నేతలను పార్టీలో చేర్చుకుంటోంది.

370 రద్దు ప్రభావం

రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆర్టికల్​ 370ని రద్దు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ భాజపా పట్ల సానుకూలత పెరిగింది. ముఖ్యంగా యువత మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రద్దు నిర్ణయంతో సభ్యత్వ నమోదు పెరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.

విమోచన మంత్రం

తెరాసను ఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని భాజపా వదులుకోవడం లేదు. సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పట్టుబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది.

ప్రత్యామ్నాయం

రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో ఉండాలని భాజపా రాష్ట్ర నేతలకు అధిష్ఠానం సూచించింది. తెరాసపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రాజెక్టుల్లో, సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయనేతలూ తెరాస పథకాలను, అవినీతిని, కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

ఇదీ చూడండి: ఈ శివలింగం ఎదురుగా రెండు నందులుంటాయి...

Intro:Body:Conclusion:
Last Updated : Aug 25, 2019, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.