ETV Bharat / city

బయో ఆసియా 2020 'రేపటి కోసం నేడు'

హైదరాబాద్​లో జరగనున్న బయో ఆసియా సదస్సు వెబ్​సైట్, బ్రోచర్​ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సుమారు 55 దేశాల నుంచి 1,800 మంది ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు, ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు.

bioasia 2020
author img

By

Published : Oct 16, 2019, 9:25 PM IST

లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ నగర స్థానాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా పలు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బయో ఆసియా సదస్సు థీమ్​ను ప్రకటించారు. వెబ్​సైట్, బ్రోచర్​ను ఆవిష్కరించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్, టీఎస్​ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ సంచాలకులు, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. రేపటి కోసం నేడు అన్న థీమ్​తో 2020 బయోఆసియా సదస్సు జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.

ఇప్పటికే ప్రపంచంలోని ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కార్యక్రమాల్లో బయోఆసియా ఒకటిగా నిలిచిందని, ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు ప్రతినిధులు హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఎదగడంలో బయోఆసియా సదస్సు కీలకంగా నిలిచిందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హెచ్​ఐసీసీ వేదికగా జరగనున్న బయోఆసియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అసోం, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా సదస్సుకు హాజరవుతాయని చెప్పారు.

సుమారు 55 దేశాల నుంచి 1,800 మంది ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు, ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. బయోఆసియా సదస్సులో అంకురాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని... ఈసారి సుమారుగా వందకు పైగా కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని చెప్పారు.

ఇదీ చూడండి: మరో 8 లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తాం: కేటీఆర్

File : TG_Hyd_65_16_Bioasia2020_AV_3053262 From : Raghu Vardhan Note : Photos from Whatsapp ( ) లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ నగర స్థానాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆన్నారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందన్న ఆయన... రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా పలు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బయోఆసియా సదస్సు థీమ్ ను ప్రకటించిన కేటీఆర్... వెబ్ సైట్, బ్రోచర్ లను ఆవిష్కరించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ సంచాలకులు, బయోఆసియా సీఈఓ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. రేపటి కోసం నేడు అన్న థీమ్ తో 2020 బయోఆసియా సదస్సు జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కార్యక్రమాల్లో బయోఆసియా ఒకటిగా నిలిచిందని, ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు ప్రతినిధులు హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఎదగడంలో బయోఆసియా సదస్సు కీలకంగా నిలిచిందని అన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హెచ్ ఐసీసీ వేదికగా జరగనున్న బయోఆసియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అసోం, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా సదస్సుకు హాజరవుతాయని చెప్పారు. సుమారు 55 దేశాలనుంచి 1800 మంది ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు, ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. బయోఆసియా సదస్సు లో అంకురాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని... ఈసారి సుమారుగా వందకు పైగా కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.