ETV Bharat / city

girl raped : బాలికపై అత్యాచారం చేసిన రిటైర్డ్ ఉన్నతాధికారి - మైనర్ బాలికపై అత్యాచారం

కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు బాలికపై పశువులా ప్రవర్తించాడు. ఓ ఉన్నత పదవిలో పనిచేసిన దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. నగరంలోని ఓ అభం శుభం తెలియని బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

girl rape
girl rape
author img

By

Published : Oct 20, 2021, 7:53 PM IST

హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని వడ్డేపల్లికి చెందిన 13 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచార ఘటన కలకలం రేపింది. ఓ ఉన్నత విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఓ కామాంధుడు అభం శుభం తెలియని బాలికను నాగుపాములా కాటేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను లోబర్చుకున్న దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఉన్నత విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ పొందిన భిక్షపతి అనే వృద్ధుడు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింట్లో నివాసముంటున్న బాలికపై కన్నేసిన నిందితుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను లోబర్చుకున్నాడు. మొదట ఈ విషయాన్ని గమనించిన బాలిక పెద్దమ్మ కేకలు వేయగా.. స్థానికులంతా కలిసి నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేయూ పీఎస్​కు తరలించారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : గంజాయి సాగు, వినియోగంపై యుద్ధం ప్రకటిద్దాం: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.