ETV Bharat / city

Earthquake in Visakhapatnam: విశాఖలో స్వల్ప భూప్రకంపనలు

Earthquake in Visakhapatnam
Earthquake in Visakhapatnam
author img

By

Published : Nov 14, 2021, 7:23 AM IST

Updated : Nov 14, 2021, 9:44 AM IST

07:20 November 14

విశాఖలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు

విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, బీచ్‌రోడ్డు, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, గురుద్వారా, రైల్వేస్టేషన్‌, బీచ్‌ రోడ్డు, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

విశాఖ ఓల్డ్ టౌన్‌తో పాటు, ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ శబ్దంతో ఉదయం 7.15 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శాంతిపురం ఎన్జీవోస్‌ కాలనీలో భవనాల శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడ్డాయి. 

ఇటీవల రాష్ట్రంలోని జగిత్యాల, రామగుండంలో అక్టోబర్​ 31న స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 6.49 గంటల సమయంలో పట్టణంలోని రహమత్ పురలో 4 సెకన్లపాటు కదిలికలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జగిత్యాలతో పాటు కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు భూమిలో శబ్దం రావడం వల్ల ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. బీర్పూర్, కోరుట్ల, మెట్​పల్లి, మల్యాల, వెల్గటూర్ తదితర మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోనూ భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. 

ఇదీచూడండి: Gadchiroli Encounter news : గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ వారున్నారా?

Last Updated : Nov 14, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.