ETV Bharat / city

లాక్​డౌన్​ మరికొంత కాలం కొనసాగాలి: కేటీఆర్​ - కేటీఆర్​ వార్తలు

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. శుక్రవారం ట్విట్టర్‌లో 'ఆస్క్ కేటీఆర్' పేరిట.. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అయితే ప్రభుత్వంలోని ఇతర భాగస్వాములతో కలిసి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల పరీక్షల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు.

miniter-ktr-commented-on-lock-down-extension-through-twitter
లాక్​డౌన్​ మరికొంత కాలం కొనసాగాలి: కేటీఆర్​
author img

By

Published : Apr 11, 2020, 5:56 AM IST

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నాయన్నారు. ట్విట్టర్ ఖాతాలో 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రశ్నలు, సమస్యలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.

లాక్​డౌన్ మరికొన్ని వారాలు పొడిగించాలన్నది తన అభిప్రాయమన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పెరిగిందన్న మంత్రి.. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు.

ఏడాదిలో పది రోజులు..

ప్రపంచమంతా అంగీకరిస్తే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పది రోజులు పరిమిత స్థాయిలో లాక్‌డౌన్ ప్రకటిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత లాక్‌డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కాలుష్యం, భూతాపంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈటల దృష్టికి..

వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన వారిపై గౌరవభావం ఏర్పడటం మంచి పరిణామమన్నారు. లాక్‌డౌన్ మెదలైన నాటి నుంచి పుట్టిన పసిపాపలకి ఇంటివద్దే వ్యాక్సిన్‌ వేసే అంశాన్ని మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

సంక్షోభం పాఠం నేర్పింది

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న కొన్ని హాట్‌స్పాట్‌లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సామూహిక కరోనా టెస్టులు చేయడం ద్వారా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తుందని వివరించారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అందరికీ ఒక పాఠం నేర్పిందని మంత్రి అన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఓపికపట్టాలి

వైరస్‌కి వాక్సిన్ లభించే వరకు ఇతర దేశాల నుంచి భారత్​లోకి రాకపోకలను పూర్తిగా నిషేధించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాల కళ్లు తెరిపించిందని, భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి కచ్చితంగా అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల పరీక్షల గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్న కేటీఆర్​.. కొంత ఓపిక పట్టాలని సూచించారు. ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నారు.

ఇవీచూడండి: జీవో 169 రద్దు చేయాలి : ఎంపీ బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.