Dharani portal issues: ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం తాజాగా రూపొందించిన ఐచ్ఛికాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్కే భవన్లో సబ్ కమిటీ మరో దఫా సమావేశమైంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
dharani new options: సమస్యల పరిష్కారం కోసం ఐదు, ఆరు మాడ్యూల్స్ రూపొందించాలని మంత్రులు గత సమావేశంలో అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మాడ్యూల్స్, వాటి ద్వారా పరిష్కార మార్గాలను మంత్రులు పరిశీలించారు. మంత్రివర్గ ఉపసంఘం మరోమారు సమావేశమై ముఖ్యమంత్రికి తుది నివేదిక అందించనుంది.
dharani new updates: ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలు వచ్చాయి. వాటిలో 46 సమస్యలకు ధరణి పోర్టల్‌లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించారు. భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలంటే పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్‌లు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు.
dharani portal news: ప్రస్తుతం ధరణిలో 31 సేవలు, 10 సమాచార మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. భూసమస్యలపై విజ్ఞప్తులకు కూడా ఒక మాడ్యూల్ ఉన్నా.. అది దరఖాస్తులను స్వీకరించడానికే పరిమితమవుతోంది. ఈ సమస్యపైనా దృష్టిసారించిన ఉపసంఘం.. రైతులెవ్వరూ ఇబ్బందులు పడకుండా సాంకేతికంగా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా పోర్టల్‌లో ఏర్పాట్లు ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మంత్రి వర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందించిన తరువాత ధరణిలో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు.
సంబంధిత కథనాలు..