ETV Bharat / city

'దసరా తర్వాతే బడులు.. అప్పటి వరకు ఆన్​లైన్ చదువులే..

author img

By

Published : Oct 7, 2020, 9:46 PM IST

విద్యా సంస్థలు ప్రారంభంపై మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. దసరా తర్వాత లేదా వచ్చే నెలలో విద్యా సంస్థలు తెరవాలని విద్య, సంక్షేమ శాఖల ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. కరోనా పరిస్థితులు, అధికారుల నివేదికల ఆధారంగా.. విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రులు తెలిపారు. ముందుగా ఉన్నత విద్య కళాశాలలు, ఆ తర్వాత పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఆన్ లైన్ విద్య కొనసాగించాలన్నారు.

sabitha
sabitha

రాష్ట్రంలో విద్యా సంస్థలను దసరా తర్వాత.. లేదా వచ్చే నెలలో తెరవాలని విద్యా శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ముందుగా ఉన్నత విద్యను అందించే కాలేజీలు తెరిచి.. ఆ తర్వాత పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈనెల 15 తర్వాత విద్యా సంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో.. విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్.. వివిధ విద్యా శాఖలు, గురుకులాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రతిపాదనలు ఇవ్వండి

విద్యా సంస్థల ప్రారంభంపై రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా వ్యవస్థలు ఒకే విధానాన్ని అనుసరించాలని మంత్రులు పేర్కొన్నారు. కాబట్టి ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. కొన్ని రోజుల పాటు షిఫ్టుల విధానమా లేక రోజు విడిచి నిర్వహించాలా తదితర అంశాలపై పాఠశాల, ఇంటర్, సాంకేతిక, గురుకుల విద్యా శాఖలు ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రులు కోరారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక వైద్యారోగ్య శాఖ సహకారంతో విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆన్ లైన్ పాఠాలు ప్రతీ విద్యార్థికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

86 శాతం విద్యార్థులు ఆన్​లైన్​లో వింటున్నారు​

విద్యా సంస్థలు తెరిచినప్పటికీ.. కొంతకాలం ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో బోధన కొనసాగించాల్సి ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల, అధికారుల నివేదికల ఆధారంగా విద్యా సంస్థల ప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 86 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు వింటున్నట్లు సర్వేలో తేలిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి చెప్పారు.

ఓకే విధానం ఉండాలి

ఈనెలలో దసరా పండగ ఉన్నందున.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఐటీడీఏల్లో విద్యా శాఖ అధికారిని నియమించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. అన్ని గురుకులాలు, విద్యా శాఖల్లో ఒకే విధానం ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

ఇదీ చదవండి: 2 వేలకు పైగా విద్యార్థుల ఎంసెట్​ ఫలితాల్లో తేడాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.