ETV Bharat / city

'బంగారు తెలంగాణ అంటే అందరికీ బతుకుదెరువు కల్పించడమే'

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌ హెచ్ఎండీఏ మైదానంలో సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశారు. సంచార వాహనాల ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి లభిస్తోందని మంత్రులు పేర్కొన్నారు.

ministers started mobile fish selling vehicles in hyderabad

author img

By

Published : Mar 27, 2021, 1:26 PM IST

Updated : Mar 28, 2021, 10:56 AM IST

రాష్ట్రంలో కొద్దికాలంలోనే నీలి, గులాబీ విప్లవాలు సాధించగలిగామని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రజలకు ఆరోగ్యపుష్టి దొరుకుతోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌ హెచ్ఎండీఏ మైదానంలో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. 60 శాతం రాయితీపై జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశారు.

'బంగారు తెలంగాణ అంటే అందరికీ బతుకుదెరువు కల్పించడమే'

గతంలో ఏ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని... తెలంగాణ వచ్చాకే బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు కేటాయించినట్టు మంత్రి తలసాని తెలిపారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా నీటివనరులు పెరిగాయన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో ఉత్పత్తి పెరిగిందని వివరించారు. సంచార వాహనాల ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కొన్ని చోట్లే చేపలు దొరుకుతున్నాయన్న హరీశ్‌రావు... మంత్రి తలసాని చొరవతో సంచార చేపల విక్రయ వాహనాలు ఏర్పాటు కావటం సంతోషమన్నారు. మంచినీళ్లలో పెరిగే చేపలకు రుచి ఎక్కువ అని... తెలంగాణలో చేపలు మంచినీటిలోనే పెంచుతున్నాయని వివరించారు. తెలంగాణలో చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. ఏడాదంతా చెరువులు నిండుగా ఉండేలా నింపడమే కాకుండా... ప్రభుత్వం ఉచితంగా చేపలు, రొయ్యలు పంపిణీ చేస్తోందని హరీశ్​రావు తెలిపారు.

వారికి ధన్యవాదాలు...

హైదరాబాద్​ నగర పరిధిలోని మత్స్య సొసైటీలకు మత్స్యశాఖ తరఫున తక్కువ ధరలకే హొల్​సేల్​ చేపలు అందిస్తామని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా తెలిపారు. తద్వారా మత్స్య మహిళలు రకరకాల చేపల వంటకాలను ఫిష్ మొబైల్ వెహికిల్ సహకారంతో విక్రయించి ఆర్థికంగా బలోపేతం కావాలనేదే తమ లక్ష్యమన్నారు. ఎన్నో ఎళ్లుగా పెండింగ్​లో ఉన్న రివాల్వింగ్ ఫండ్​ను మత్స్యమహిళా సంఘాలకు అందించడంలో కృషి చేసిన కమిషనర్ భూక్యా, ఏడీలు రాజారాం, శ్రీనివాస్​లకు హైదరాబాద్ మత్స్య సహకార సంఘాల చైర్​ పర్సన్ పద్మ బెస్త, తెలంగాణ గంగపుత్ర మహిళా సభ అరుణ జ్యోతి బెస్త ప్రత్యేక ధ్యనవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్తా ప్రభాకర్ రెడ్డి, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్, అరికపూడి గాంధీ, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, కమిషన్ భూక్యా లచ్చీరామ్ పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల నుంచి మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు తరలివచ్చారు.

ఇదీ చూడండి: మళ్లీ విజృంభిస్తున్న కరోనా... తాజాగా 495 కేసులు నమోదు

Last Updated : Mar 28, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.